![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -310 లో.. రామలక్ష్మి, సీతాకాంత్ లు కలిసి లైవ్ ప్రోగ్రామ్ చేస్తారు. అందులో భద్రం ఫోటో చూపించి ఇతన్ని కలిసి సెల్ఫీ తీసుకొని పంపినవారికి తన చేత మీకు పెట్టుబడి పెట్టిస్తానంటూ సీతాకాంత్ చెప్తాడు. దాంతో కొంతమంది భద్రాన్ని వెతకాలని అనుకుంటారు. ఆ ప్రోగ్రాం అంత శ్రీలత వాళ్ళు చూస్తారు. బావగారి తెలివి మాములుగా లేదు కదా.. ఈ దెబ్బతో ఆ భద్రం గాడు దొరకడం ఖాయమంటూ శ్రీవల్లి అంటుంది.
పాపం సీతాకాంత్.. నా గురించి వెతుక్కుంటున్నాడు కావచ్చు కానీ ఫోన్ స్విచాఫ్ చేసి రెండు రోజులు అవుతుందని భద్రం అనుకుంటాడు. అప్పుడే శ్రీలత మనిషి వచ్చి.. డోర్ కొడతాడు. భద్రం బయటకు వెళ్ళగానే భద్రo చూడకుండా లోపలికి వెళ్తాడు. ఎవరు లేరు కదా అని భద్రం లోపలికి రాగానే అతను ఎదరు పడతాడు. ఎవరు నువ్వు అని భద్రం అడుగగా.. నీ శత్రువు శత్రువుని అని అతను అంటాడు. అంటే నా మిత్రడివా అని భద్రం అంటాడు. అప్పుడే శ్రీలత ఫోన్ చేయడంతో బయటకి వచ్చి మాట్లాడతాడు. మళ్ళీ లోపలికి వెళ్లి.. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు నాతో రా అని భద్రాన్ని తీసుకొని వెళ్తాడు.
ఇంకా ఎవరు భద్రం గురించి కాల్ చెయ్యడం లేదని రామలక్ష్మి సీతాకాంత్ లు చూస్తారు. రామలక్ష్మి తన బస్తీలోని ఆడవాళ్లకి భద్రం ఫోటో చూపించి కన్పిస్తే చెప్పండి అని చెప్తుంది. రామలక్ష్మి సీతాకాంత్ లు భోజనం చేస్తుంటే శ్రీలత ఫోన్ చేసి.. ఆ భద్రం గాడు మీకు దొరకడు నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగమని శ్రీలత అంటుంది. ఆ తర్వాత సిరి వచ్చి శ్రీలతకి చివాట్లు పెడుతుంది. ఆ తర్వాత బస్తీలోని ఆడవాళ్లు రామలక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు చెప్పిన అతను ఎక్కడ కన్పించలేదని చెప్పడంతో రామలక్ష్మి, సీతాకాంత్ లు డిస్సపాయింట్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |